: చంద్రన్న బీమాను ‘గిన్నిస్’కు పంపే ప్రతిపాదనల్లో ప్రభుత్వం


‘చంద్రన్న బీమా’ పథకాన్ని గిన్నిస్ రికార్డుకు పంపే ప్రతిపాదనల్లో ఉన్నామని ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ పథకంపై ఈరోజు తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పల్స్ సర్వేలో ఇప్పటివరకు 1.70 కోట్ల మంది ‘చంద్రన్న బీమాలో సభ్యులుగా చేరారని, మరో 60 లక్షల మంది సభ్యులుగా చేరే అవకాశం ఉంది. ఇంతమంది సభ్యులతో ఇన్సూరెన్స్ చేసిన ప్రభుత్వ పథకం ప్రపంచంలో మరొకటి లేదని, అందుకనే, చంద్రన్న బీమా పథకాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపే నిమిత్తం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ‘చంద్రన్న బీమా’ గురించి వివరించారు. ఈ బీమా చేయించుకున్న వ్యక్తి కనుక చనిపోతే సంబంధిత సంఘానికి సమాచారం ఇచ్చిన 48 గంట్లలోపు రూ.5 వేలు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నెలరోజుల్లోపు మిగిలిన రూ.4.95 లక్షలు బాధిత కుటుంబానికి అందజేస్తారని, ఈ పథకంలో చేరేందుకు ఆధార్ కార్డుతో అవసరం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News