: నా మాట నా శరీరం వింటుంది: ప్రియాంకా చోప్రా
తన శరీరం తన మాట వింటుందని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తెలిపారు. అమెరికా సీరియల్ క్వాంటికోతో అంతర్జాతీయ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా బాలీవుడ్ లో సినిమాలు నిర్మిస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో విశ్రాంతి లేకుండా పని చేయడం ఇబ్బందిగా ఉండడం లేదా? అని ప్రశ్నించగా, అబ్బాయిలతో పోలిస్తే భారత్ లో అమ్మాయిలపై వివక్ష అధికంగా ఉంటుందని, అలాంటి చోట తన తల్లిదండ్రులు వివక్ష చూపకుండా తనను పెంచారని, తన ఇష్టప్రకారమే సినిమాల్లోకి వచ్చానని తెలిపింది. కెరీర్ ని ఎంతగానో ప్రేమిస్తానని తెలిపింది. అందుకే నటిగా ఎదిగేందుకు ఎంతగానో శ్రమిస్తానని తెలిపింది. అంతలా శ్రమిస్తే ఆరోగ్యం పాడవుతుందని శ్రేయోభిలాషులు హెచ్చరిస్తుంటారని చెప్పింది. అయితే తాను తన శరీరం చెప్పినట్టు విననని, తాను ఏం చెబితే దానిని తన శరీరం వింటుందని ఆమె తెలిపింది.