: హైవేలపైనే రన్ వేలు... దేశ వ్యాప్తంగా 22 ప్రాంతాలు గుర్తింపు


జాతీయ రహదారులపై విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్ వేలు నిర్మించే దిశగా భారత రక్షణ శాఖ, జాతీయ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రచిస్తున్నాయి. విమానాలు ల్యాండ్ కావడానికి, టేకాఫ్ కావడానికి ఈ రన్ వేలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. దేశ వ్యాప్తంగా ఉన్న రహదారులపై ఇలాంటి రన్ వేలు నిర్మించడానికి ఇప్పటికే 22 స్పాట్లను గుర్తించారు. వీటి నిర్మాణం పూర్తయితే ఎయిర్ స్ట్రిప్ ల సంఖ్య డబుల్ అవుతుందని... అంతేకాకుండా, అనువుగా లేని ప్రాంతాలకు సైతం మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనికి సంబంధించి రక్షణశాఖతో త్వరలోనే అత్యున్నత సమావేశం ఏర్పాటు చేయనున్నామని... ఇరు శాఖలకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని... ఈ సమావేశంలో రన్ వేల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రన్ వేల పొడవు, వెడల్పు ఎంతుండాలి? అనే అంశంతో పాటు ఇతర సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News