: యూపీలో కాంగ్రెస్ కు రీటా బహుగుణ షాక్?


ఉత్తరప్రదేశ్ లో పాగావేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తొలి ఎదురుదెబ్బ పీసీసీ మాజీ చీఫ్ నిర్మల్ ఖాత్రి బీజేపీలో చేరడం ద్వారా తగిలితే, ఇప్పుడు రెండో షాక్ కూడా మరో ప్రముఖ నేత ద్వారా తగిలేలా వుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రీటా బహుగుణ బీజేపీలో చేరే ఉద్దేశంలో వున్నట్టు, ఈ మేరకు ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసినట్టు సమాచారం. ఆమె త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. 2011 యూపీ పీసీసీ చీఫ్ గా పని చేసిన రీటా బహుగుణ 2012 ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పాలవ్వడంతో ఆమె పదవికి రాజీనామా చేశారు. లక్నో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం హిస్తున్న రీటా బహుగుణ తొలుత సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు ప్రయత్నించినా, తాజాగా బీజేపీ వైపు మొగ్గుచూపడం విశేషం. ప్రశాంత్ భూషన్ వ్యూహరచనతో యూపీలో ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ, బ్రాహ్మణులు, మైనార్టీలు, ఎస్సీఎస్టీలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రీటా బహుగుణ పార్టీని వీడడం కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే అవుతుంది!

  • Loading...

More Telugu News