: నాలుగు విభాగాల్లో 15 చిన్న యూనిట్లుగా విడిపోయిన ఇన్ఫోసిస్
ఆదాయాన్ని మరింతగా పెంచుకోవడంపైన, క్లయింట్లపైన మరింతగా దృష్టిని సారించిన ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్, తన సామ్రాజ్యాన్ని నాలుగు విభాగాల్లో 15 చిన్న యూనిట్లుగా విడగొట్టింది. అమ్మకపు ఆదాయం పెంచుకోవడంతో పాటు అంతర్గత నిర్వహణను సులభతరం చేసేందుకే ఈ పని చేసినట్టు సంస్థ ఉన్నత వర్గాలు తెలిపాయి. ప్రతి చిన్న ఇండస్ట్రీ యూనిట్ 500 మిలియన్ డాలర్ల నుంచి 700 మిలియన్ డాలర్ల ఆదాయం ఇచ్చేలా ఉంటుందని, ప్రతిదానికి ఓ అధిపతి ఉంటాడని, లాభ నష్టాల బాధ్యతలు అతనిపైనే ఉంటాయని సంస్థ వర్గాలు వెల్లడించాయి. 3 బిలియన్ డాలర్ల ఆదాయం ఇచ్చేలా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ఇన్స్యూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సేవల విభాగాన్ని 2.3 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చేలా రిటైల్ అండ్ లైఫ్ సైన్సెస్ విభాగాన్ని, 2.2 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చేలా మాన్యుఫాక్చరింగ్ అండ్ హైటెక్ విభాగాన్ని, 1.9 బిలియన్ డాలర్లు ఆదాయం ఇచ్చేలా ఎనర్జీ అండ్ యుటిలిటీస్, కమ్యూనికేషన్స్ సేవా విభాగాన్ని విభజించినట్టు తెలుస్తోంది. బీఎస్ఎఫ్ఐ విభాగంలో డ్యూటస్చ్ బ్యాంక్, గోల్డ్ మన్ సాక్స్ ప్రధాన క్లయింట్లుగా ఉన్నాయి. ఈ విభాగానికి అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ గా జస్మీత్ సింగ్ం యూరప్ కు అజయ్ విజ్ మరియు కన్నన్ అమరేష్, ఆస్ట్రేలియాకు ఆండ్ర్యూ గ్రోత్ లు నేతృత్వం వహిస్తుండగా, ఇకపై వీరంతా బీఎస్ఎఫ్ఐ హెడ్ మోహిత్ జోషికి రిపోర్ట్ చేస్తారని తెలుస్తోంది. హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ యూనిట్ కు విప్రో మాజీ వెటరన్ సంగీతా సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఆమె సోమవారం నాడు ఇన్ఫీలో చేరి, ఈ విభాగం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె కూడా మోహిత్ జోషికి రిపోర్ట్ చేయాల్సి వుంటుంది. ఈ మేరకు సంస్థ సీఓఓ ప్రవీణ్ రావు నుంచి నియమించిన అన్ని బిజినెస్ యూనిట్ హెడ్ లకు ఈ-మెయిల్ లేఖలు అందినట్టు తెలుస్తోంది. మిగతా విభాగాల్లో ఉన్నతాధికారులను నియమించాల్సివుంది.