: స్త్రీలకు న్యాయం చేయండి.. ముస్లిం మతపెద్దలకు రాందేవ్ బాబా సూచన
ట్రిపుల్ తలాఖ్ విధానంపై ముస్లిం మతపెద్దలు పునరాలోచించాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సూచించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, మూడు సార్లు తలాఖ్ చెప్పి విడాకులు తీసుకోవడం దారుణమని అన్నారు. ఈ విధానం మనవహక్కులు, స్త్రీల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన సూచించారు. ముస్లిం పెద్దలు స్త్రీలకు న్యాయం చేసేలా వ్యవహరించాలని ఆయన కోరారు. ఉమ్మడి పౌరస్మృతి అమలులో భాగంగా న్యాయశాఖ తయారు చేసిన ప్రశ్నావళిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తమ చట్టాలను కోర్టులు మార్చలేవని ముస్లిం పర్సనల్ లాబోర్డు స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే.