: నా పేరుతో సేవా కార్యక్రమాలు వద్దు: కార్యకర్తలకు లోకేష్ హితవు
తన పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ వచ్చిన అభిమానులను టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ వారించారు. పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోకేశ్ ను గుంటూరులో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు 'నారా లోకేష్ వెల్ఫేర్ అసోసియేషన్' పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వెంటనే వారిని వారించిన లోకేష్... తన పేరుతో సేవాకార్యక్రమాలు చేయవద్దని స్పష్టం చేశారు. ఎవరికైనా పార్టీయే సుప్రీం అని తేల్చిచెప్పిన ఆయన, వ్యక్తి పేరుతో కాకుండా, పార్టీ పేరుతో సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు.