: యూఎస్ లో ఘోరం... ఒలింపిక్ పతక విజేత టైసన్ గే కుమార్తె దారుణ హత్య


అమెరికాలో దారుణం జరిగింది. ప్రముఖ స్పింటర్, ఒలింపిక్ పతక విజేత టైసన్ గే కుమార్తె ట్రినిటీ గే (15)ను కెంటకీ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ లో దారుణంగా కాల్చి చంపారు. వర్శిటీ రెస్టారెంట్ పార్కింగ్ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఆదివారం తెల్లవారుఝామున 4 గంటల సమయంలో కాల్పులు జరిగినట్టు లెగ్జింటన్ పోలీసులు తెలిపారు. రెండు వాహనాల్లో వచ్చిన వ్యక్తుల మధ్య కాల్పులు జరిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఓ వాహనాన్ని, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని వివరించాయి. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, స్పింటర్ గా ఎదుగుతున్న ట్రినిటీ మృతిపై కెంటకీ హైస్కూల్ అథ్లెటిక్ అసోసియేషన్ సంతాపాన్ని తెలిపింది.

  • Loading...

More Telugu News