: మరోసారి వార్తల్లోకి రాధేమా... ఇక్కడా వివాదమే!


తనకు తాను దైవాంశసంభూతురాలినిగా చెప్పుకుని పలుమార్లు తన వివాదాస్పద చర్యలు, నడవడికతో వార్తల్లో నిలిచిన రాధేమా మరోసారి రచ్చకెక్కింది. హరిద్వార్ కు వచ్చిన ఆమె, గంగానదీ తీరంలోని హరీకీ పౌరీ ఆలయానికి షూ ధరించి వచ్చి పూజలు చేసింది. ఈ ఆలయంలోకి షూ, చెప్పులు ధరించి వెళ్లకూడదు. కానీ, రాధేమా మాత్రం ఎరుపురంగు దుస్తుల్లో ధగధగలాడుతూ, అదే రంగు షూ వేసుకుని వచ్చి, గంగానదికి పాలాభిషేకం చేసి, బ్రహ్మకుండ్ లో పూజలు చేసింది. దీన్ని తీవ్రంగా తీసుకున్న యువతీర్థ్ పురోహిత్ మహాసభ, ఇకపై రాధేమాను రానివ్వబోమని హరీ కీ పౌరీ ఆలయంలోకి ఆమెను నిషేధిస్తున్నామని ప్రకటించింది. షూతో వచ్చి ఆమె లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంది. కాగా, హరిద్వార్ కు వచ్చిన రాధేమా, తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతూ, తానేమీ దైవాన్ని కాదని, సాధారణ మహిళనని, ప్రజలు తమ తల్లిదండ్రులను గౌరవించాలని అనుభాషణం చేసింది. గతంలో అశ్లీల డ్యాన్సులు, పొట్టి డ్రస్సులతో కలకలం రేపిన రాధేమాను ఓ హత్య కేసులో, గృహ హింస కేసులో పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News