: దీపావళికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తోంది. దీనిని ప్రత్యేకంగా బ్యూరోక్రాట్ల కోసం ఉద్దేశించిన ఆన్ లైన్ పోర్టల్ వెల్లడించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సులపై నియమించిన నిపుణుల కమిటీ ఏడో వేతన సంఘం సిఫారసులను యథాతథంగా ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు మరో రెండు వారాల్లో నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అలవెన్సుల పెంపును ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా నేతృత్వంలోని కమిటీ తిరస్కరించకపోవచ్చని, వాటిని వేతనంలో భాగంగా కొనసాగించే అవకాశం ఉందని ఈ ఆన్ లైన్ పోర్టల్ పేర్కొంది. నవంబరు నాటికి నివేదిక ఇవ్వాల్సి ఉండగా, నెల ముందు అంటే అక్టోబరులోనే నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.