: త్రివిక్రమ్ ని నిద్ర లేపి మరీ 'పంచ్' వేసేవాడిని!: సినీ కథానాయకుడు సునీల్


ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గడిపిన రోజులను ప్రముఖ సినీ నటుడు సునీల్ గుర్తుచేసుకున్నాడు. తమ ఇద్దరి మధ్య పంచ్ ల యుద్ధం నడిచేదని అన్నాడు. ఒకరిపై ఒకరు మాటల పంచ్ లు వేసుకుని నిద్రపోయేవారమని అన్నాడు. అయితే త్రివిక్రమ్ పంచ్ వేసేసి నిద్రపోయేవాడని, తనకేమో పంచ్ వెయ్యకపోతే నిద్రపట్టేది కాదని, ఆలోచిస్తూ, ఆలోచిస్తూ అలా నిద్రపోయేవాడినని, అరగంట తరువాత ఏదో పంచ్ తనకు తోస్తే, త్రివిక్రమ్ ను లేపి ఆ పంచ్ వేసేవాడినని అన్నాడు. అసలు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు అని అన్నాడు. అలాగే త్రివిక్రమ్ కి ఫ్యాన్ ఎక్కువ వేగంగా పెడితే నిద్రపట్టదని, దీంతో అతను నిద్రపోయిన అరగంట తరువాత ఫ్యాన్ స్పీడ్ గా పెట్టుకుని నిద్రపోయేవాడినని... త్రివిక్రమ్ కి నిద్రలేవడానికి బద్ధకం కావడంతో.. 'అరే... స్పీడు తగ్గించరా' అంటూ రాత్రంతా మోచేత్తో పొడిచేవాడని గుర్తుచేసుకున్నాడు. ఏ స్థాయికి ఎదిగినా ఆ రోజులు గుర్తువస్తే ఉండే ఆనందం వేరని అన్నాడు.

  • Loading...

More Telugu News