: జయలలితను పరామర్శించిన రజనీకాంత్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత వద్దకు కుమార్తె సౌందర్యతో కలిసి వెళ్లిన రజనీకాంత్ పరామర్శించారు. ఆమె ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను పరామర్శించనున్నారని, ఇంకా తేదీ ఖరారు కాలేదని కేంద్ర నౌకాయాన సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్ వెల్లడించారు. జయలలితను పరామర్శించేందుకు త్వరలోనే ఆయన చెన్నై వస్తారని ఆయన తెలిపారు.