: లక్ష్మీపార్వతి చెప్పినట్టు ఎన్టీఆర్ ఏ రోజూ చేయలేదు.. అసలు ఒకరు చెబితే చేసే వ్యక్తిత్వం కాదు ఆయనది!: దాడి


ఎన్టీఆర్ వివాహానంతరం అడ్మినిస్ట్రేషన్ లో లక్ష్మీ పార్వతి కలుగజేసుకుంటున్నారన్నది ఆమె వ్యతిరేకవర్గం ఆరోపణ అని దాడి వీరభద్రరావు తెలిపారు. ఆమె చెబితే తాను ఎందుకు నిర్ణయాలు తీసుకుంటానని, ఒకరు చెబితే నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం తనది కాదని ఎన్టీఆర్ భావనని ఆయన అన్నారు. కొన్ని సందర్భాల్లో లక్ష్మీ పార్వతి ఏదైనా చెప్పినప్పటికీ, అందుకు భిన్నంగా తాము ఏదైనా సలహా ఇస్తే ఆయన దానినే అమలు చేసేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. అసలు ఆమె చెప్పినట్టు ఎన్టీఆర్ ఏ రోజూ చేయలేదని, అలా ఒకరు చెబితే చేసే వ్యక్తిత్వం ఆయనది కాదని దాడి తెలిపారు.

  • Loading...

More Telugu News