: ఎన్టీఆర్, చంద్రబాబును కలిపే అవకాశం ఎవరికీ రాలేదు: దాడి
చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ మధ్య సయోధ్యకు తాను ప్రయత్నించానని దాడి వీరభద్రరావు తెలిపారు. 'సర్, మీరిద్దరూ రెండు అధికార కేంద్రాలుగా ఉండడం పార్టీలో అందరికీ ఇబ్బందిగా ఉంది... మీరు కలిసిపోతే బాగుంటుందని చంద్రబాబునాయుడుకు తాను సూచించానని దాడి చెప్పారు. దీంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించి, ఆయనను కలవడంలో ఇబ్బందులేమున్నాయని చెప్పి ఎన్టీఆర్ ను కలిశారని గుర్తుచేసుకున్నారు. అయితే ఆ భేటీ కూడా సానుకూలంగా సాగలేదని ఆయన అన్నారు. ఆ తరువాత వారిద్దరినీ కలిపే ఎలాంటి అవకాశం రాలేదని ఆయన చెప్పారు.