: రహనే బ్యాటు విరగ్గొట్టిన బ్రాస్ వెల్ బంతి


ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో రహనే బ్యాటును కివీస్ బౌలర్ బ్రాస్ వెల్ విరగ్గొట్టాడు. 191 పరుగుల విజయలక్ష్యంలో టీమిండియా బ్యాటింగ్ ను రోహిత్ శర్మ, అజింక్యా రహానే ప్రారంభించారు. రాహుల్ ద్రవిడ్ కు నకలుగా బావించే రహానే కు కివీస్ బౌలర్ బ్రాస్ వెల్ ఆఫ్ స్టంప్ పై అవుట్ స్వింగర్ ను సంధించాడు. దీనిని స్క్వేర్ లెగ్ దిశగా రహానే తరలించాలని ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాటుకు తగలగానే బ్యాటులోని దిగువ భాగం విరిగిపోయింది. దీంతో ఆ బంతికి సింగిల్ రన్ లభించినా, రహానే, రోహిత్ నవ్వుకున్నారు. బ్యాటు మార్చిన రహానే బంతిని గాల్లోకి లేపకుండా ఆడుతున్నాడు. ఈ క్రమంలో 4 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ (4), అజింక్యా రహానే (14) 19 పరుగులు సాధించారు.

  • Loading...

More Telugu News