: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో... సౌదీ అరేబియాలో ల్యాబ్ టెక్నీషయన్లు, నర్సుల ఉద్యోగాలకు రేపు, ఎల్లుండి ఇంటర్వ్యూలు


ఉపాధి అవకాశాల కోసం బ్రోకర్లను ఆశ్రయించి మోసపోతున్న తెలంగాణ యువతకు అండగా ప్రభుత్వం నిలిచే చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే విదేశాల్లో పని చేయాలనుకుంటున్న వారికి అవసరమైన సూచనలు చేస్తున్న ప్రభుత్వం, కళాశాలలు, కంపెనీలతో ఒప్పందం చేసకుంది. అందులో భాగంగా సౌదీ అరేబియాలో ల్యాబ్ టెక్నిషియన్లు, నర్సులుగా పనిచేయగోరే యువతకు మెహిదీపట్నంలోని జి.పుల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఫార్మసీలో రేపు, ఎల్లుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు కొనసాగనున్నాయి. ఔత్సాహికులు ఈ ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రభుత్వం సూచించింది.

  • Loading...

More Telugu News