: ప్రమాదకర ఆండర్సన్ ను పెవిలియన్ కు పంపిన హార్డిక్
ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేతో వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్య బాగానే ఆకట్టుకున్నాడు. ఉమేష్ యాదవ్ తో కలిసి కొత్త బంతి పంచుకున్న హార్డిక్ పాండ్య రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. అతని నమ్మకాన్ని నిలబెడుతూ బంతి అందుకున్న తొలి ఓవర్ లోనే ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ ను హార్డిక్ పాండ్య అవుట్ చేశాడు. అనంతరం 11వ ఓవర్ లో నాలుగో బంతికి కివీస్ విధ్వంసకర ఆటగాడు కోరే ఆండర్సన్ (4) ను అవుట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో 11 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, హార్డిక్ పాండ్య చెరి రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.