: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే వికెట్ తీసిన పాండ్యా
ధర్మశాలలో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డే పోటీతో అరంగేట్రం చేసిన బౌలర్ హార్దిక్ పాండ్యా, అత్యంత ప్రమాదకర బ్యాట్స్ మన్ గుప్టిల్ ను తన తొలి ఓవర్లోనే పెవీలియన్ దారి పట్టించాడు. ఆట మొదటి ఓవర్ ను వేసిన ఉమేష్ యాదవ్ ఒక పరుగు ఇవ్వగా, రెండో ఓవర్ ను వేసిన పాండ్యా, ఆఖరి బంతికి గుప్టిల్ ను బోల్తా కొట్టించాడు. అంతకుముందు పాండ్యా వేసిన ఐదు బంతుల్లో గుప్టిల్ మూడు ఫోర్లను కొట్టడం గమనార్హం. పాండ్యా వేస్తున్న బంతులను ఫోర్లకు తరలిస్తూ, అదే ఊపును చూపబోయిన గుప్టిల్ స్లిప్ లో ఉన్న శర్మకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు.