: ఢిల్లీపై పెను దాడి కుట్ర భగ్నం.. బాంబుల తయారీ పదార్థాలు సహా 9 మంది తీవ్రవాదుల అరెస్ట్


ఢిల్లీపై పెను దాడి జరిపి విధ్వంసం సృష్టించాలన్న కుట్ర భగ్నమైంది. అయితే ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఆలోచన కాదు. నక్సలైట్లు పన్నిన కుట్ర. యూపీకి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, తమకున్న సమాచారంతో ఢిల్లీపై దాడి జరిపి 9 మంది నక్సలైట్లను అరెస్ట్ చేయడం తో పాటు వారి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నోయిడాలోని రెసిడెన్షియల్ ప్రాంతంగా నిత్యమూ బిజీగా ఉండే హిండాన్ విహార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో దాగున్న నక్సల్స్ ను అదుపులోకి తీసుకున్నామని, వీరిలో పీపుల్స్ వార్ గ్రూప్ కమాండర్ ప్రదీప్ కుమార్ సింగ్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 6 పిస్టల్స్, 50 క్యాట్రిడ్జ్ లు, 45 జిలిటన్ స్టిక్స్, 125 డిటోనేటర్లు, 13 మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నేషనల్ కాపిటల్ రీజియన్ ప్రాంతంలో దాడి చేయాలన్నది వీరి ఉద్దేశమని తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో జార్ఖండ్ కు చెందిన పవన్, యూపీకి చెందిన రంజిత్ పాశ్వాన్, గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్ కుమార్, బీహార్ కు చెందిన కృష్ణ కుమార్ రామ్, బులంద్ షహర్ నివాసి సూరజ్ తదితరులు ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News