: నారింజరంగులో చందమామ... నేడు వినీలాకాశంలో అద్భుతం!


నేడు వినీలాకాశంలో జరిగే అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించవచ్చు. కాంతులీనే పున్నమి చంద్రుడు సాధారణ స్థాయి కన్నా మరింత పెద్దగా, నారింజ రంగును సంతరించుకుని సూపర్ బ్లడ్ మూన్ గా కనిపించనున్నాడు. ప్రతి పున్నమి నాడూ వెండి వెలుగులు విరజిమ్మే చంద్రుడు, నేడు ఎరుపు రంగు కాంతిని పరుస్తాడన్నమాట. ఈ పున్నమినే శరత్ పున్నమని కూడా పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. శరదృతువులో వచ్చే పౌర్ణమి నాడు భూమికి చంద్రుడు అతి దగ్గరగా వస్తాడు. మరింత అందంగా కనిపిస్తాడు. సూర్యుడి కాంతి మరింతగా చంద్రుడిపై పడి ఎరుపు రంగులోకి మారుతున్నట్టుగా అనిపిస్తూ, నారింజ రంగులో కనిపిస్తాడు.

  • Loading...

More Telugu News