: ఇప్పుడేం చేద్దాం?... పవన్ రంగ ప్రవేశంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు కీలక సమావేశం


పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా ఆక్వాఫుడ్‌ ఫ్రాజెక్టుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం, నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో, ప్రాజెక్టు విషయంలో తదుపరి ముందడుగు ఎలా వేయాలన్న విషయమై, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. అందుబాటులోని మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ ఈ సమావేశానికి రాగా, వివాదాస్పదమైన ఆక్వా ఫుడ్ పార్క్ వాస్తవ పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్ ఏం చెప్పాడని అడిగి తెలుసుకున్న సీఎం, మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, భూములు కోల్పోయే రైతులకు ఆకర్షణీయమైన ప్యాకేజీని తయారు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News