: పెళ్లి ప్రస్తావన తెచ్చిన అభిమానికి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన బాలీవుడ్ అందాల తార


వివాహమై నాలుగు పదుల వయసు మీదపడినా చెక్కు చెదరని అందంతో అభిమానులను మురిపిస్తున్న బాలీవుడ్ నటి టిస్కా చోప్రా, తనతో పెళ్లి ప్రతిపాదన తెచ్చిన అభిమానికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా, ఓ అభిమాని టిస్కాను వివాహం చేసుకునేందుకు ప్రతిపాదించాడు. పెళ్లయి ఓ పాపను కూడా కలిగున్న టిస్కా, కాస్తంత కొంటెగా సమాధానం ఇస్తూ, "నేను స్పందించాలని మీరు ఎదురు చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ ప్రపోజల్ కు నేను సిద్ధం. మీ వివరాలన్నీ పంపండి. నేను ఎవరి కోసం వెళతానో, అతన్ని చూడాలని నా భర్త కోరుకుంటున్నాడు" అంటూ దిమ్మతిరిగే సమాధానం పెట్టింది. దీంతో ఆ అభిమాని మరొక్క మాట మాట్లాడలేదు.

  • Loading...

More Telugu News