: పవన్ ఏం చెప్పినా విలువైనదే... సూచనలు స్వీకరిస్తాం: ఏపీ మంత్రి ప్రత్తిపాటి


సినీ నటుడు పవన్ కల్యాణ్ తమ పార్టీకి కావాల్సిన వ్యక్తని, ఆయన ఏం చెప్పినా తాము వింటామని, ఆయన్నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మార్కెట్‌ యార్డు గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రత్తిపాటి, ఆక్వా ఫుడ్‌ పార్క్‌ పై పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాకే ఈ ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేస్తామని స్పష్టం చేస్తూ, సీఎం చంద్రబాబుతో ఇదే విషయమై చర్చించనున్నట్టు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఫుడ్‌ పార్క్‌ పై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News