: తండ్రి మద్దతు కోల్పోయిన అఖిలేష్ కు బాబాయ్ మద్దతు!


వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రస్తుత సీఎం అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోడని స్వయంగా సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ప్రకటించి సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆయన సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ అఖిలేష్ కు మద్దతుగా నిలిచారు. సమాజ్ వాదీ పార్టీ తిరిగి విజయం సాధిస్తే, సీఎం పదవికి అఖిలేష్ పేరును తాను స్వయంగా ప్రతిపాదిస్తానని తెలిపారు. తండ్రి ఇచ్చిన షాక్ లో ఉన్న అఖిలేష్ కు శివపాల్ మద్దతు పలకడం గమనార్హం. ఇక పార్టీలో విభేదాలు లేవని, అంతా ఐకమత్యంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా శివపాల్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News