: ఇంత త్వరగా పనవుతుందని అనుకోలేదు: అచ్చెన్నాయుడు
రాష్ట్రం విడిపోయిన తరవాత కేవలం రెండున్నరేళ్లలో కొత్త రాజధాని నుంచి పాలన పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని తాను అనుకోలేదని, ఇదంతా తమ పార్టీ అధినేత చంద్రబాబు కృషి వల్లే సాకారమైందని ఏపీ కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్ లోకి ఆయన ప్రవేశించారు. ఆపై యూత్ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని మంత్రి వర్గానికి సిఫార్సు చేస్తూ తొలి సంతకం చేశారు. రికార్డు సమయంలో సెక్రటేరియేట్ నిర్మాణం పూర్తయిందని, ఇంత త్వరగా పనులు పూర్తయి, తన శాఖ ఇక్కడ ప్రారంభమవుతుందని తొలుత ఊహించలేదని అన్నారు. 2018లో జాతీయ క్రీడలను ఏపీలో నిర్వహించనున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.