: పెంపు తరువాత తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలివే!
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడంతో, లీటరు పెట్రోల్ పై రూ. 1.34, డీజిల్ పై రూ. 2.37 మేరకు ధరలను పెంచుతున్నట్టు ఓఎంసీ (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ధరల పెరుగుదల తరువాత హైదరాబాద్ లో లీటరు పెట్రోలు రూ. 69.07 నుంచి రూ. 70.91కి పెరిగింది. డీజిల్ ధర రూ. 57.35 నుంచి రూ. 60.37కు చేరింది. విశాఖపట్నంలో పెట్రోలు ధర రూ. 70.20 నుంచి రూ. 71.98కి, డీజిల్ ధర రూ. 58.46 నుంచి రూ. 61.36కు పెరిగాయి. వరంగల్ లో పెట్రోలు ధర రూ. 68.69 నుంచి రూ. 70.53కు, డీజిల్ ధర రూ. 57.03 నుంచి 60.05కు చేరాయి. గుంటూరులో పెట్రోల్ ధర రూ. 70.47 నుంచి 72.26కు, డీజిల్ ధర 59.26 నుంచి 62.16కు పెరిగాయి.