: ప్రభుదేవా సినిమా షూటింగ్ లో ప్రమాదం...షాహిద్ కపూర్ కు గాయాలు
ప్రభుదేవా డైరెక్షన్లో వస్తోన్న 'రాంబో రాజ్ కుమార్' చిత్రం షూటింగ్ లో నేడు అపశృతి చోటు చేసుకుంది. ముంబయిలో యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుండగా హీరో షాహిద్ కపూర్ గాయపడ్డాడు. కాలుతున్న ఇంటి సెట్ లో చిత్రీకరణ జరుపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాహిద్ కపూర్ వీపుకు, చేతులకు గాయాలయ్యాయి. దీంతో, షూటింగ్ నిలిపివేసి షాహిద్ కపూర్ ను ఆసుపత్రికి తరలించారు.