: టాయ్ లెట్ సీటు కన్నా అధిక బ్యాక్టీరియాతో డెబిట్ కార్డులు, కీబోర్డ్, మౌస్ లు!


నిత్యమూ ఉపయోగించే సెల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి కీబోర్డ్, మౌస్ తదితరాలపై టాయ్ లెట్ సీటు కన్నా అధిక బ్యాక్టీరియా తిష్ట వేసిందని అమెరికన్ సంస్థ తేల్చి చెప్పింది. ఒరేగాన్ కు చెందిన సీబీటీ నగ్గెట్స్ అనే సంస్థ పరిశోధకులు ఓ అధ్యయనం చేసి విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఐడీ కార్డుపై చదరపు అంగుళానికి 46.20 లక్షల బ్యాక్టీరియా ఉండగా, కంప్యూటర్ కీ బోర్డుపై 35.43 లక్షలు, సెల్ ఫోన్ పై 16 లక్షలు, మౌస్ పై 13.70 లక్షల బ్యాక్టీరియా ఉన్నట్టు తేల్చింది. ఈ బ్యాక్టీరియాలో ప్రమాదకరమైన కోకై బ్యాక్టీరియా 42 శాతం ఉందని, గ్రామ్ నెగటివ్ రాడ్స్ బ్యాక్టీరియా 21.5 శాతం ఉందని దీనివల్ల తినే ఆహారం విషపూరితం కావడం, పలు రకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయని, నెగటివ్ రాడ్స్ బ్యాక్టీరియాలు శరీరంలోకి వెళితే, యాంటీ బయాటిక్స్ కు అంత త్వరగా లొంగవని తెలిపారు. వీటితో పని అయిపోయిన తరవాత యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ వాష్ లతో చేతులు శుభ్రం చేసుకోవడమే పరిష్కారమార్గమని తెలిపారు.

  • Loading...

More Telugu News