: ప్రధాని కావాలన్న ఆశ లేదు: చంద్రబాబు


దేశానికి ప్రధానమంత్రిని కావాలన్న కోరిక తనకు లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలను అందించిన ఆయన, ప్రసంగిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించి, అగ్రగామిగా నిలపాలన్నదే తన కోరికని తెలిపారు. విద్యార్థుల్లో కుల మతాలకు అతీతంగా ప్రతిభను వెలికితీయాల్సి వుందని అభిప్రాయపడ్డ ఆయన, విదేశీ విద్యార్థులు నవ్యాంధ్రకు వచ్చి విద్యను అభ్యసించేలా అభివృద్ధి చేస్తామని, భవిష్యత్తులో ఏపీ ఎడ్యుకేషన్ హబ్ అవుతుందని వివరించారు. మరో మూడు నెలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, కాలేజీల్లో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News