: అంచనాలు లేని ఆటగాడి చేతిలో ఓడిన జొకోవిచ్.. మైదానంలో సహనం కోల్పోయి వింత ప్రవర్తన
ఏమాత్రం అంచనాలు లేని ఓ ఆటగాడి చేతిలో అనూహ్య ఓటమి పాలైన సెర్బియా దిగ్గజం, వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మైదానంలో సహనం కోల్పోయాడు. షర్టు విప్పేసి వింతగా ప్రవర్తించాడు. షాంఘై మాస్టర్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీఫైనల్లో జొకోవిచ్ స్పెయిన్ ఆటగాడు రొబర్టో బాటిస్టా చేతిలో 6-4, 6-4 తేడాతో వరస సెట్లు కోల్పోయి పరాజయం పాలై టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాడు. డిఫెండింగ్ చాంపియన్, 12 గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్న జొకోవిచ్ ఓ సాధారణ ఆటగాడి చేతిలో ఓటమి కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే షర్టు విప్పేసి అంపైర్ వైపు పడేసి అసహనం ప్రదర్శించాడు. రాకెట్‌ను పదేపదే విసిరి కొడుతూ వింతగా ప్రవర్తించాడు. ఓటమిని జీర్ణించుకోలేకే జొకోవిచ్ ఇలా చేసి ఉండొచ్చని టెన్నిస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.