: రష్యా పోలీసులకు ఎట్టకేలకు దొరికిన కరుడుగట్టిన రేపిస్టు!


ప్రపంచంలో అత్యంత కరుడుగట్టిన రేపిస్టును రష్యా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రష్యాలోని మాస్కోకు చెందిన వాల్రీ మెకరెన్‌ కోవ్ (69) భయంకరమైన రేపిస్టు. తన ప్రతీ పుట్టిన రోజున మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం అతని హాబీ. ఇలా అతను ఇప్పటి వరకు 90 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తుండగా, పోలీసులు మాత్రం అతను 108 రేపులు చేశాడని చెబుతున్నారు. ఇతని రేప్ జాబితాలో పదేళ్ల పసివారు కూడా ఉండడం దారుణం. 43 సంవత్సరాల క్రితం ఈ కీచకుడు మొదటి రేప్ చేశాడు. తనను వాల్రీ మెకరెన్‌ కోవ్ రేప్ చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి పోలీసులు నిందితుడి కోసం వేటాడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికి రష్యా పోలీసులు సుమారు 26,000 మంది నేరగాళ్ల వివరాలను ఫిల్టర్ చేశారు. ఇన్నేళ్ల తరువాత అప్పటి రేప్ దర్యాప్తులోని ఆధారాలకు, ఒక వ్యక్తికి పోలికలు సరిపోవడంతో పోలీసులు, తీగలాగారు. దీంతో డొంక కదిలింది. ఈ రేపిస్టుకి ఓ సైకిల్ ఉంది. ఎవరినైనా రేప్ చేయాలనుకుంటే తలకు నల్ల టోపీ పెట్టుకుని ఆ మహిళలను ఈ సైకిల్‌ పై ఫాలో అవుతాడు. తరువాత ఆమెను రేప్ చేసి, ఆమెకు సంబంధించిన కొన్ని వస్తువులను ఆ రేప్ కు గుర్తులుగా తన వెంట తీసుకెళతాడని పోలీసులు తెలిపారు. ఇలా 108 మందిని రేప్ చేసిన ఈ దుర్మార్గుడు తన పుట్టిన రోజున రేప్ చేసిన వారికి తానే పెద్ద బహుమతి అని పేర్కొంటాడు. తన కోసమే వారు పుట్టారని కూడా చెబుతాడట. ఇన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఈ రేపిస్టుకి మాస్కో న్యాయస్థానం 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News