: నాటో ఆర్మీ హెలికాప్టర్ ను కూల్చేసిన రష్యా!


మూడు రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలతో ఉక్రెయిన్ లో చోటుచేసుకుంటున్న పరిస్థితులను ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఇంతలో ఉక్రెయిన్ లో రష్యా మద్దతుదారులు నాటో దళాలకు చెందిన హెలికాప్టర్ ను కూల్చేశారు. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఈ హెలీకాఫ్టర్‌ లో నాటో మిలటరీకి చెందిన సలహాదారులు ప్రయాణిస్తున్నారు. వీరంతా బతికే ఉన్నారా? లేక మరణించారా? అన్న విషయం వెల్లడి కావాల్సి ఉంది. అయితే హెలీకాఫ్టర్‌ ను కూల్చివేసింది మాత్రం నిజమేనని మీడియా పేర్కొంటోంది. దీనిని డోనెస్క్ ప్రజలు కూడా నిర్ధారించారు. నాటోలో బ్రిటన్, ఐర్లాండ్, యూఎస్ సభ్యదేశాలు కావడంతో ఈ సంఘటనతో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News