: బలూచిస్థాన్‌లో మరోసారి బయటపడిన పాకిస్థాన్ తీరు
బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ అక్రమాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ ప్రాంతంలో పాక్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. పాకిస్థాన్‌లో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న పస్తున్ జాతి ప్రజలపై పాకిస్థాన్ విరుచుకుపడుతోంది. ఆ దేశ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు అక్కడి ప్రాంత ప్రజలు వెళ్లిపోవాలంటూ వారిపై అరాచకాలు చేస్తున్నాయి. తమను ఆఫ్ఘానిస్థాన్‌లోని ‘ఖోస్ట్’ ప్రాంతానికి వెళ్లిపోవాలని పాక్ బలవంతపెడుతోందని పస్తున్ తెగకు చెందిన ఓ వ్యక్తి మీడియాకు తెలిపాడు. తమకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఆ దేశ ఆర్మీ తమపై బాంబుదాడులకు దిగుతోందని చెప్పాడు. మరో బలూచ్ వ్యక్తి మాట్లాడుతూ... తాలిబాన్ల నెపంతో తమ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని ఆర్మీ చిత్రహింసలు పెడుతోందని పేర్కొన్నాడు. వజీరిస్థాన్ వ్యక్తి స్పందిస్తూ ఉగ్రవాదులు పాక్‌లోని ఇస్లామాబాద్, కరాచీలాంటి ప్రదేశాల్లో ఉన్నారన్నది అందరీకి తెలిసిన విషయమేనని అన్నాడు. పాక్ ఆర్మీ తమపై దిగుతున్న హింసను మానుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు.