: ఉత్తరాఖండ్ అధికార పీఠం కూడా బీజేపీదే: ఒపీనియన్ పోల్
2017లో జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని ఇండియాటుడే-యాక్సిస్ ఒపీనియన్ పోల్ లో తేలింది. బీజేపీ విజయం సాధించి, అధికార పీఠం సొంతం చేసుకుంటుందని వెల్లడైంది. సర్వే ఫలితాల ప్రకారం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా... 70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ 38 నుంచి 43 చోట్ల విజయం సాధిస్తుంది. మరోవైపు, బీజేపీ సీనియర్ నేత బీసీ ఖండూరి ముఖ్యమంత్రి కావాలని పోల్ లో పాల్గొన్న దాదాపు 86 శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు (2007-09, 2011-12) ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు.