: కోహ్లీ నుంచి నేను సలహాలు తీసుకుంటున్నాను.. కావాలంటే మీరూ గమనించండి: ధోనీ
టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ధర్మశాలలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలు చెప్పాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి తాను సలహాలను స్వీకరిస్తున్నానని చెప్పాడు. తాను క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు కోహ్లీ ఇచ్చే సూచనలనే అధికంగా ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నాడు. రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ధర్మశాలలో వన్డే సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. అభిమానులకు ఈ అంశంపై ఒక సూచన కూడా చేశాడు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు గమనించి చూస్తే తాను విరాట్‌తో అధికంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తుందని చెప్పాడు.