: ర‌ష్యాతో చర్చలు భవిష్యత్తులో రక్ష‌ణ‌, ఆర్థిక రంగాల్లో దృఢ‌మైన బంధానికి పునాదులు వేస్తాయి: మోదీ


భార‌త్‌లో త‌యారీ ల‌క్ష్య‌ సాధ‌న‌కు ఈ రోజు ర‌ష్యాతో జ‌రిగిన ఒప్పందాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. ర‌ష్యాతో చర్చలు భవిష్యత్తులో రక్ష‌ణ‌, ఆర్థిక రంగాల్లో దృఢ‌మైన బంధానికి పునాదులు వేస్తాయని చెప్పారు. ర‌క్ష‌ణ రంగంలో కీల‌క ఒప్పందాలు జ‌రిగిన‌ట్లు మోదీ తెలిపారు. కామోన్ 226టీ హెలికాఫ్ట‌ర్ల త‌యారీ, యుద్ధనౌక‌ల నిర్మాణం, ఇత‌ర ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల అభివృద్ధిపై ఒప్పందాలు కుదిరాయ‌ని చెప్పారు. భార‌త సాంకేతిక‌, ర‌క్ష‌ణ ప్రాథ‌మ్యాల‌కు అనుగుణంగా ఉన్నాయని అన్నారు. భార‌త్‌-ర‌ష్యా మ‌ధ్య స్నేహ‌బంధం మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని అన్నారు. ర‌ష్యా అధ్య‌క్షుడితో భేటీ ద్వారా వచ్చిన అత్యంత విలువైన ఫలితాలు భారత్-రష్యాల వ్యూహాత్మక భాగస్వామ్యంలోని ప్రత్యేకతను చాటి చెబుతున్నాయని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News