: బాబా జై గురుదేవ్‌ సభలో తీవ్ర విషాదం.. రాజ్ ఘాట్ వంతెనపై తొక్కిసలాట... 19 మంది మృతి


ఉత్తరప్రదేశ్‌లో ఈ రోజు అప‌శ్రుతి చోటుచేసుకుంది. బాబా జై గురుదేవ్‌ సభ సందర్భంగా భారీగా భ‌క్తులు త‌ర‌లిరావ‌డంతో వారణాసి, చందౌలి మధ్య రాజ్‌ఘాట్‌ వంతెనపై తొక్కిసలాట జ‌రిగింది. ప్ర‌మాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రి కొంత‌మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న భ‌ద్ర‌తా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన‌ యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్ మృతుల కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున‌, గాయాల‌పాలై చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున ప‌రిహారం ఇస్తామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News