: ఆ విద్యార్థిపై దాడి చేసింది అన్నదమ్ములు... పైగా నేరగాడి సంబంధీకులు!


రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో స్కూలు ముగిసిన అనంతరం యూనిఫాంలో ఉన్న ఇద్దరు విద్యార్థులు ఒక కుర్రాడ్ని దారుణంగా కొట్టిన సంగతి తెలిసిందే. దీనిని మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. జాతీయ, ప్రాంతీయ మీడియా మొత్తం ప్రసారం చేసిన ఈ ఘటనలో ఉన్నది బీహార్ లోని ముజఫర్ పూర్ లోని కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ అని నిర్ధారించారు. దాడికి తెగబడిన విద్యార్థులిద్దరూ సొంత అన్నదమ్ములని, అదే కేంద్రీయ విద్యాలయాలో 12 స్టాండర్డ్ చదువుతున్నారని గుర్తించారు. వారిద్దరూ పరారీలో ఉన్న ఓ నేరగాడి సంబంధీకులని కూడా పోలీసులు గుర్తించారు. గతనెల 25న అదే ప్రాంగణంలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని అత్యంత దారుణంగా కొట్టారు. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు, వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News