: 'పురచ్చితలైవి' జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: జగన్
గత నెల 22వ తేదీన చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘'పురచ్చితలైవి' జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. జయలలిత వీలైనంత త్వరగా మళ్లీ ప్రజాసేవలోకి రావాలని దేవుడిని కోరుతున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు. జయలలితకు ఆరోగ్య పరిస్థితిని అపోలో ఆసుపత్రిలో లండన్ వైద్యులతో సహా ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.