: ప్రేమ వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య


సోనీ అనే యువతి హైదరాబాదులోని మల్కాజిగిరిలో నివాసం ఉంటుంది. తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఉండగా కొన్నాళ్ల క్రితం సూరజ్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. సికింద్రాబాదులో చిరుద్యోగం చేసుకుంటున్న సూరజ్ తన కుటుంబ సభ్యుల మద్దతుతో సోనీపై వేధింపులకు దిగాడు. దీంతో రెండు నెలల క్రితం తల్లిదండ్రులతో కలిసి సోనీ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అసలు పట్టించుకోకపోవడంతో సూరజ్ పేట్రేగిపోయి సోనీ తండ్రిపై చేయిచేసుకున్నాడు. దీంతో అతని నుంచి వేధింపులు తాళలేని సోనీ ఆత్మహత్యకు పాల్పడింది.

  • Loading...

More Telugu News