: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన మోదీ
గోవాలో రెండు రోజుల పాటు జరగనున్న బ్రిక్స్ సమాఖ్య (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకోగానే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పుతిన్ కి స్వాగతం పలుకున్నట్లు పేర్కొన్నారు. కొద్ది సేపటి క్రితం పుతిన్‌తో సమావేశమైన మోదీ.. రష్యా, భారత్ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు సహా పలు అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రష్యా మద్దతును పొందాలని భారత్ యోచిస్తోంది. ఇరువురు దేశాధినేతలు మరికాసేపట్లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు సమాచారం.