: 'బ్రాందీ'వాదులెవరో ప్రజలందరికీ తెలుసు!: భట్టి విక్రమార్క కౌంటర్
బ్రాందీవాదులెవరో, గాంధీవాదులెవరో తెలంగాణ ప్రజలకు తెలుసంటూ కాంగ్రెస్ పార్టీపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. బ్రాందీవాదులెవరో ప్రజలందరికీ తెలుసని... మత్తు వదిలించుకుని వస్తేనే రైతుల కష్టాలేంటో తెలుస్తాయని ఆయన అన్నారు. లేకపోతే, ప్రభుత్వంపై రైతులు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని తాటిపూడి, సోమవరం గ్రామాల మధ్య అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను భట్టి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.