: పంట కాల్వలోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు.. తూర్పుగోదావరిలో ఘటన
ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పు గోనగూడెం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు తూర్పు గోనగూడెం వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.