: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్కు చెందిన నలుగురు దుర్మరణం
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. తిరుమల నుంచి హైదరాబాద్కు కారులో వస్తుండగా జిల్లాలోని చాగలమర్రి వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిని హైదరాబాద్కు చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.