: హైదరాబాద్‌లో పోలీస్ దొంగ.. తాళం వేసిన ఇంట్లో చోరీ చేస్తూ అడ్డంగా దొరికిన ఎస్సై
నిత్యం దొంగలను, క్రిమినల్స్‌ను చూస్తున్న ఫలితమో, ఏమో కానీ సాక్షాత్తూ ఓ ఎస్సై దొంగగా మారాడు. దురదృష్టం వెంటాడి అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్‌లోని అల్మాస్‌గూడలో జరిగిందీ ఘటన. స్థానిక శ్రీశ్రీ హోమ్స్‌లోని శివప్రసాద్ అనే వ్యక్తికి చెందిన తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన ఎస్సై మహేందర్‌రెడ్డి చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకున్న మీర్‌పేట పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు బృందంలో ఎస్సై మహేందర్‌రెడ్డి సభ్యుడు కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలోని గుర్రంగూడకు చెందిన మహేందర్‌రెడ్డి 2009లో ఎస్సైగా ఎంపికయ్యాడు.