: వైజాగ్ లో ఉన్మాది వీరంగం... కత్తితో ఏడుగుర్ని పొడిచేశాడు!
విశాఖపట్టణంలోని బర్మా క్యాంపు నుంచి వచ్చిన ఓ ఉన్మాది ఊర్వశి జంక్షన్, కంచరపాలెం, కంచరపాలెం మెట్టు ప్రాంతంలో ఏడుగురిని పొడిచేసిన ఘటన కలకలం రేపుతోంది. రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకున్న ఉన్మాది రోడ్డు మీద కనిపించిన వారిని కనిపించినట్టు పొడిచేశాడు. ఐదుగురు పురుషులు సహా ఇద్దరు మహిళల కడుపులో కత్తులు దించాడు. ఇది చూసిన స్థానికులు ఉన్మాదిని బంధించి చితక్కొట్టి, పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన బాధితుల్లో నలుగుర్ని కేజీహెచ్ కు తరలించగా, ముగ్గురు ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.