: బంధుప్రీతి విమర్శలతో పదవికీ రాజీనామా చేసిన కేరళ మంత్రి
గత రెండు వారాలుగా వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో కేరళ మంత్రి వర్గం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి ఇ.పి.జయరాజన్ నిష్క్రమించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని కీలక నియామకాల్లో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడినట్లు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నేడు జరిగిన సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశంలో విమర్శలకు తలొగ్గి తాను రాజీనామా చేస్తున్నానని జయరాజన్ ప్రకటించారు. అయితే, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తీసుకున్న దృఢ నిర్ణయమే ఆయన రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సీపీఎంతో పాటు ఎల్‌డీఎఫ్ పేరు ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.