: చంద్రబాబును విమర్శించడానికి నీకు నోరెలా వస్తోంది?: రోజాకు పరిటాల సునీత ప్రశ్న
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. అమరావతిలో ఆమె మాట్లాడుతూ, డ్వాక్రా రుణమాఫీ చేసి మహిళలకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రిని మహిళా ద్రోహి అనడానికి ఎమ్మెల్యే రోజాకు నోరెలా వచ్చిందని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిహక్కు, మహిళా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి, మహిళలకు సముచిత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రిపై ఆమె అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో కూడా డ్వాక్రా రుణమాఫీ చేసి మహిళలకు అండగా నిలబడ్డ చంద్రన్నను విమర్శించే అర్హత రోజాకు లేదని ఆమె తెలిపారు.