: డిసెంబర్ 15 లోగా మాల్యా విమానాన్ని వేలం వేయండి: బాంబే హైకోర్టు ఆదేశం


విజయ్‌ మాల్యాకు చెందిన ప్రైవేటు విమానానికి డిసెంబర్ 15 లోగా మళ్లీ వేలం నిర్వహించాలని సేవల పన్ను శాఖ (సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్)కు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాల్యా విమానానికి వేలం నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌ పై విచారణ ప్రారంభించిన జస్టిస్‌ ఎస్‌.సి. ధర్మాధికారి, బీపీ కొలాబవాలాలతో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'విమానాన్ని మాల్యా ఎయిర్‌ పోర్ట్‌ లో వదలివెళ్లిపోయారు. బకాయిలు పేరుకుపోతున్నాయి, మీరు (సర్వీస్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌) సమయం వెచ్చిస్తున్నారు. డిసెంబర్‌ 15లోగా మొత్తం వేలం ప్రక్రియను పూర్తి చేసి, విమానం నిలిపి ఉంచిన ప్రదేశాన్ని ఖాళీ చేయించండి' అని కోర్టు స్పష్టం చేసింది. తాము పేర్కొన్న గడువుకంతా వేలం ప్రక్రియ పూర్తవుతుందని విశ్వసిస్తున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్‌ 20కి వాయిదా వేశారు. కాగా, మాల్యా వదిలేసి వెళ్లిన ఎయిర్‌ బస్‌ 319 రకం విమానంలో 25 మంది ప్రయాణించవచ్చు.

  • Loading...

More Telugu News