: ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కటకటాల్లోకి వెళ్లిన టీచర్
ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పాఠశాల ప్రిన్సిపల్ ను కటకటాల వెనక్కి పంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మీరట్ పట్టణంలోని సర్దానా ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాలకు ప్రిన్సిపల్ గా పని చేస్తున్న ముదస్సిర్ రాణా అనే వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, సంఘ్ ఇతర నేతలు, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, యోగా గురు రాందేవ్ బాబాలపై అసభ్యకరమైన రీతిలో పలు వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పోలీసులకు పలువురు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. ఆయనపై అభియోగాలు నిజమని తేలడంతో ఐపీసీ సెక్షన్ 153, ఇతర ఐటీ చట్టాలను ఉపయోగించి కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.